దేశంలో స్థిరంగా ఉన్న బంగారం - వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా వెండి ధర అయితే బాగా తగ్గింది. ఉక్రెయిన్ - రష్య దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా బంగారు ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెల్సిందే. అయితే, ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తాజాగా శుక్రవారం మార్కెట్ వివరాల మేరకు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం కిందికి దిగివచ్చాయి. దేశీయంగా వెండి ధరలు ఏకంగా రూ.5 వేలకు పైగా తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న వెండి ధరల వివరాలను పరిశీలిస్తే,
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.47,650గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా వుంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,930గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,290గా ఉంది.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.47,650గా ఉంటే, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.47,650గా ఉంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,980గా ఉంది.