తగ్గుముఖం పడుతున్న బంగారం..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితుల కారణంగా ఎప్పటికప్పుడు మారుతుంటుంది బంగారం ధర. ఈసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ఇప్పుడు తగ్గుతోంది.
ఒకవైపు ఇంధనం ధరలు పెరిగిపోతుంటే.. బంగారం ధరలు కాస్త తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం బంగారం ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.
ఇక ధరల విషయానికి వస్తే.
22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 47750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయిలు తగ్గి 52100 గా ఉంది
వెండి కేజీ ధర 600 రూపాయిలు తగ్గి 72100 గా ఉంది.
నగరాల్లో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 750 రూపాయలు కాగా, 24 క్యారెట్ల ధర బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 750 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 750 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది.