సంబంధిత వార్తలు
- అంతగా ఇష్టపడితే భారత్కు వెళ్ళిపోండి.. అధికారం కోసం ఏడుపేంటి?
- BYEBYEJagan హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్.. ఎందుకో తెలుసా? (video)
- పుతిన్ నిర్ణయంపై భారత్ ఆందోళన... 20 వేల మందికి పైగా విద్యార్థులు?
- సంచలన నిర్ణయం తీసుకున్న సచిన్ టెండూల్కర్
- బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తాకు స్టెప్పులు.. సాయికి బిగ్ బాస్ ఆఫర్?
ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఏకంగా 100 కార్లు గిఫ్ట్.. ఎక్కడ?
Cars
తాజాగా చెన్నైకి చెందిన ఓ ఐటీ కంపెనీ కూడా తమ కంపెనీలోని ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కార్లను బహుమతిగా అందజేసింది. అవును నిజమే. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐడియాస్2ఐటీ తన ఉద్యోగులకు 100 కార్లను బహుమతిగా ఇచ్చింది.
కేవలం ఆరుగురు ఇంజనీర్లతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీ భారత్‌తో పాటు.. అమెరికా, మెక్సీకో సహా పలు దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది.
ఈ నేపథ్యంలో ఈ సంస్థ కొత్త కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా.. సంస్థలో పని చేస్తున్న వంది మందికి 100 మారుతి సుజుకీ కార్లను బహుమతిగా ఇచ్చారు కంపెనీ సీఈవో. కంపెనీ అభివృద్ధికి వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా వారికి ఈ కార్లను బహుకరించినట్లు సీఈవో గాయత్రి వివేకానందన్ తెలిపారు.
