బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (15:31 IST)

‌బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తాకు స్టెప్పులు.. సాయికి బిగ్ బాస్ ఆఫర్?

‌ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పాటకు స్టెప్పులేసిన నవవధువు సాయిశ్రీయకి బంపర్ ఆఫర్ వచ్చింది. ఆ పాటతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన సాయికి మరో ఆఫర్ తలుపు తట్టింది. దీనితో ఆమె ఏ పాటకైతే డ్యాన్స్‌ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ.. తాము నిర్మించబోయే తదుపరి పాటకు డ్యాన్స్‌ చేసే అవకాశం కల్పించింది. 
 
త్వరలోనే సాయిశ్రీయ ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది. ఇదిలావుండగా ఆమెకి మరో బంపరాఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఓటీటీ వేదికగా మరో రెండు నెలల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది.
 
ఇందులో కంటెస్టెంట్స్‌ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీగా మారిన సాయిశ్రీయను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారని తెలుస్తోంది.
 
బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు ఆమెకూడా ఒప్పుకున్నట్లు సమాచారం. దీనిపైన క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.