1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Hyderabad metro announce offers to its passengers

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ అడ్ టి బంపర్ ఆఫర్

Hyderabad Metro
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టి బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పండగ ఆఫర్లను ప్రకటించింది. ‘మెట్రో సువర్ణ ఆఫర్ 2021’ పేరుతో ఈ నెల 18 నుంచి జనవరి 15 మధ్య ట్రిప్ పాసుల్లో పలు రాయితీలు ప్రవేశపెట్టింది. 
 
ఇందులోభాగంగా 20 ప్రయాణాలకు డబ్బులు చెల్లించి 30 సార్లు ప్రయాణించవచ్చు. అయితే, ఈ అవకాశాన్ని 45 రోజుల్లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మెట్రో కార్డుపైనే ఈ ఆఫర్‌ను పొందొచ్చు. 
 
అలాగే, జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో ప్రస్తుతం 10 కిలోమీటర్ల దూరానికి రూ.35 వసూలు చేస్తుండగా, ఇకపై దీనిని రూ.15కి తగ్గించారు. అయితే, ఇది పూర్తిస్థాయి తగ్గింపు కాదు. పైన పేర్కొన్న రోజుల్లో మాత్రమే వర్తిస్తుంది.
 
నెలలో 20 సార్లు కంటే ఎక్కువ సార్లు ప్రయాణించే వారి కోసం ప్రతి నెలా లక్కీడ్రా తీసి ఐదుగురు విజేతలను ఎంపిక చేస్తారు. లక్కీ డ్రా కోసం వీరు తమ కార్డును టీ-సవారి, లేదంటే మెట్రో స్టేషన్లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రాజేంద్ర నగర్ పీఎస్‌ పరిధిలో మహిళపై సామూహిత అత్యాచారం