సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (09:16 IST)

హైదరాబాద్‌లో రాత్రి 9.45 గంటల వరకు మెట్రో సేవలు

హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. ముఖ్యంగా రాత్రి పూట వేళలను పొడగించారు. ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9 గంటలకు కాకుండా 9.45 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 10.45 గంటలకు గమ్య స్థానం చేరుతుంది. రాత్రి ఆలస్యంగా విధులు ముగించుకుని ఇంటికెళ్లేవారికి పెంచిన వేళలతో ప్రజా రవాణా అందుబాటులో ఉండనుంది. 
 
శుక్రవారం నుంచి పెంచిన మెట్రో వేళలు అమల్లోకి వస్తాయని ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. ప్రయాణికులందరి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరు విధిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించి సహకరించాలని ఆయన కోరారు. ప్రయాణికుల నుంచి ఆదరణ పొందేందుకు రాత్రి మెట్రో వేళల్ని పెంచాలని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన మెట్రో అధికారులు ఈ మేరకు మెట్రో వేళలను పొడిగించారు.