సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (19:21 IST)

ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ కేసులు.. మళ్లీ లాక్ డౌన్

ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. సిడ్నీలో ఒక్క రోజే 150 డెల్టా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. అలాగే ఆస్ట్రేలియా దేశంలో ముఖ్య  నగరాలు అయిన పెర్త్, డార్విన్, క్వీన్స్ లాండ్‌లో కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పరిస్థితి చేయి దాటి పోయింది. 
 
దీంతో ఆస్ట్రేలియా సర్కారు త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుండటంతో వెంటనే ఈ నగరాల్లో నాలుగు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. 
 
తగిన చర్యలు తీసుకోవడంతో భాగంగా లాక్డౌన్ విధించినట్లు క్వీన్స్ లాండ్ ప్రీమియర్ అనాస్టాసియా పేర్కొన్నారు. నాలుగు రోజుల అనంతరం పరిస్థితిని బట్టి తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.