1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Covid: Sydney city centre and Bondi beach to enter lockdown

డెల్టా వైరస్.. సిడ్నీలో వారం రోజులు లాక్ డౌన్

Covid: Sydney
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. అలా ఈ కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా కరోనా అత్యంత సమర్థవంతంగా కట్టడి చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 
 
మరి అలాంటి దేశంలో కూడా డెల్టా వేరియంట్‌ దడపుట్టిస్తున్నది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన సిడ్నీలో డెల్టా వేరియంట్‌ లక్షణాలున్న కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సెంట్రల్‌ సిడ్నీలోని పలు ప్రాంతాల్లో అధికారులు లాక్‌డౌన్‌ విధించారు. 
 
వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి బాధితుని ఇంటి పక్కనున్న నాలుగు కుటుంబాలను వారం రోజులపాటు బయటకు రావద్దని అధికారులు సూచించారు.
 
అంతర్జాతీయ విమాన సిబ్బందిని సిడ్నీ ఎయిర్‌పోర్టు నుంచి క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తున్న క్రమంలో బస్సు డ్రైవర్‌కు కరోనా సోకింది. దీంతో గత వారంరోజుల్లోనే సిడ్నీలో డజన్ల కొద్ది కేసులు నమోదయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్‌ను కట్టడిచేయడానికి సిడ్నీలోని పలు ప్రాంతాల్లో లాక్‌ డౌన్‌ విధిస్తున్న ప్రకటించారు.
 
కాగా, ప్రపంచంలోని అన్ని దేశాలు మహమ్మారి వ్యాప్తితో ఇబ్బందిపడుతున్న వేళ, వైరస్‌ సంక్రమణను ఆస్ట్రేలియా విజయ వంతంగా నిలువరించగలిగింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 30,000 కేసులు మాత్రమే నమోదవగా, 910 మంది మరణించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
టెక్కీని నట్టేట ముంచాడు.. భార్య ఉన్నా.. పెళ్లి చేసుకుంది.. చివరకు..?