గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

డ్రాగన్ కంట్రీలో ఘోర అగ్నిప్రమాదం : 18మంది సజీవ దహనం

డ్రాగన్ కంట్రీ చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌, షాంగ్‌కియు నగరంలోని ఝెచెంగ్ కౌంటీలో ఈ ఘటన జరిగింది. 
 
మార్షల్ ఆర్ట్స్ కేంద్రంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు 18 మందిని బలితీసుకున్నాయి. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.