1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. 27 People Died In Road Accident At Peru

పెరు దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం : 27 మంది మృత్యువాత

Peru
పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళుతున్న బ‌స్సు లోయ‌లో ప‌డిపోవ‌డంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు చనిపోయారు. 
 
పాలొమినో కంపెనీకి చెందిన బ‌స్సులో ఒకే కుటుంబానికి చెందిన కొందరు పెరూలోని అయాకుచో నుంచి అరెక్విపా వెళ్తున్న క్ర‌మంలో ట‌రియోసియానిక్ జాతీయ ర‌హ‌దారిపై అదుపు తప్పిన బస్సు  ఒక్క‌సారిగా లోయ‌లోకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాద స్థలిలోనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం  పెరూ రాజధాని లిమా నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కరోనా టీకాలు, అపోహలు –వాస్తవాలు