సంబంధిత వార్తలు
- తెలంగాణాలో అన్‌లాక్? : థియేటర్లకు అనుమతి.. కొనసాగనున్న రాత్రి కర్ఫ్యూ
- దేశ జనాభా 133.89 కోట్లు.. ఆంధ్రాలో కర్నూలు టాప్
- గొప్ప మనసు చాటుకున్న తమిళ జంట.. రూ.37లక్షల భారీ విరాళం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూలో సడలింపులు.. సాయంత్రం 6 వరకు..
- మహారాష్ట్రలో డెల్టా ప్లస్‌తో జాగ్రత్త: తెలంగాణ సర్కారు వార్నింగ్
తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు..? కేసీఆర్ అత్యవసర భేటీ
తెలంగాణలో శనివారం (జూన్ 19) తోనే లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో కొవిడ్ పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా..? లేకుంటే నైట్ కర్ఫ్యూ విధించాలా..? అనే దానిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంది. అయితే శనివారం చేయబోయే ప్రకటన ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్ర ప్రజానికంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ శనివారం అత్యవసరంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో భేటీకి రావాల్సిందిగా మంత్రులకు ఇప్పటికే సమాచారం వెళ్లింది. నిజానికి లాక్ డౌన్ పొడగింపు లేదా ముగింపునకు సంబంధించి శుక్రవారమే ప్రకటన వస్తుందని భావించినా, శనివారం జరగబోయే అత్యవసర కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంటారని ఆలస్యంగా వెల్లడైంది.
తర్వాతి కథనం
