శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (11:00 IST)

మహారాష్ట్రలో డెల్టా ప్లస్‌తో జాగ్రత్త: తెలంగాణ సర్కారు వార్నింగ్

మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ వల్ల థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర కోవిడ్19 టాస్క్‌ఫోర్స్ , వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం సీఎం ఉద్ధవ్ థాక్రేకు నివేదిక సమర్పించారు. డెల్టా ప్లస్ వేరియెంట్‌తో థర్డ్ వేవ్ వస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు నెలల్లో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని తెలిపారు. 
 
ఐతే ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే సెకండ్ వేవ్ ముగియక ముందే విజృంభించవచ్చని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో ఔషధాలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సీఎం ఉద్ధవ్ థాక్రే ఆదేశాలు జారీ చేశారు. 
 
ఫస్ట్ వేవ్ నుంచి పాఠాలు నేర్చుకొని సెకండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని.. కానీ ప్రజలు బాధ్యతగా ఉండకపోతే తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే మహారాష్ట్ర డెల్టా హెచ్చరికలతో తెలంగాణ సర్కారు కూడా అప్రమత్తం అయ్యింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలిపింది.