శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (13:28 IST)

హుజూరాబాద్‌‌లో ఈటల ర్యాలీ.. టీఆర్ఎస్ నేతలు కూడా బిజీ బిజీ

టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఈటెల రాజేందర్ ప్రస్తుతం తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజీనామా తర్వాత హుజూరాబాద్‌తో సత్తా చాటుకునేందుకు గురువారం పర్యటించనున్నారు.

హుజురాబాద్‌ పట్టణంలోని పరకాల క్రాస్‌ రోడ్డు వద్ద ఈటల రాజేందర్‌కు భారీ ఘనస్వాగతం పలకనున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. 
 
అలాగే ఈ పర్యటన సందర్భంగా జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

మరోవైపు హుజూరాబాద్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌లు బిజీగా మారిపోయారు. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.