1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. train kills 300 sheeps in telangana

రైలు కింద పడి 300 గొర్రెలు మృత్యువాత.. రూ.18లక్షల నష్టం

Telangana
రైలు కింద పడి 300 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. నిజామాబాద్‌ జిల్లాలో గొర్రెల మంద పైనుంచి రైలు దూసుకెళ్లడంతో సుమారు 300 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. నవీన్‌పేట మండలం కోస్గీ వద్ద గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.

కాపరి గొర్రెలను మేపుతుండగా మందంతా ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చింది. అదే సమయంలో రైలు వాయువేగంతో దూసుకువచ్చి ఢీకొట్టడంతో గొర్రెలు చెల్లాచెదురయ్యాయి. 
 
సుమారు రూ. 18 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. ఊహించని ప్రమాదంలో గొర్రెలన్నీ మృత్యువాతపడటంతో రైతు కుటుంబం ఘటనాస్థలంలో కన్నీరుమున్నీరైంది. బాధిత రైతును ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పసిడి ధర పడిపోయింది.. బంగారం తగ్గినా.. వెండి మాత్రం..?