సంబంధిత వార్తలు
- జబర్దస్త్ హైపర్ ఆదిపై జాగృతి స్టూడెంట్స్ ఆగ్రహం
- తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్!
- సీజన్‌తో సంబంధం లేదు.. వ్యాధుల క్యాలెండర్‌ను రిలీజ్ చేసిన ఆరోగ్య శాఖ
- తెలంగాణాలో విస్తారంగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తారుగా వర్షాలు
- కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి..?: విజయశాంతి ఫైర్
పాల్వంచ విద్యుత్ సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సీతారంపట్నం దగ్గరున్న 600 కెవి సబ్ స్టేషనులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను చూసిన వెంటనే అప్రమాతమైన సిబ్బంది అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఆ తర్వాత క్షణాల్లో అక్కడకు తరలివచ్చిన అగ్నిమాపక సిబ్బంది... గంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం సంభవించినట్లే విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.
తర్వాతి కథనం
