మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (21:10 IST)

తెలంగాణలో జూన్ 20వ తేదీ వరకు వేసవి సెలవులు పొడిగింపు

కరోనా కారణంగా పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ జరుగుతున్నా.. వేసవి సెలవుల్లో వున్నారు విద్యార్థులు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల పునః ప్రారంభంపై గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. వేసవి సెలవులు ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 
 
గతంలో ప్రకటించిన మేరకు జూన్ 15వ తేదీ వరకు వేసవి సెలవులు ముగుస్తున్న విషయ తెలిసిందే. బుధవారం నుంచి విద్యా తరగతులపై.. ఇంకా తదితర వివరాలపై అటు ప్రభుత్వం గాని లేదా పాఠశాల విద్యాశాఖ గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
దీనిపై గందరగోళంలో ఉన్న ఉపాధ్యాయులు అటు ప్రభుత్వ పెద్దలతోనూ.. పాఠశాల విద్యాశాఖ వద్ద.. మీడియాకు ఫోన్లు చేసి ఆరా తీస్తూ వచ్చారు. ఎట్టకేలకు వీరి నిరీక్షణకు తెరదించుతూ వేసవి సెలవులు ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.