గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (20:01 IST)

శ్రీకాకుళంలో కోవిడ్ కలకలం... 28 మంది విద్యార్థులకు కరోనా

కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో కోవిడ్ కలకలమే సృష్టించింది. సూపర్‌-60 కోచింగ్ తీసుకుంటున్న 28 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలే వారం రోజులు సెలవులపై ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కోచింగ్ సెంటర్ చేరుకున్నారు. ఈనెల 2వ తేదీ నుంచి శిక్షణా తరగతులు తిరిగి ప్రారంభం అయ్యాయి. 
 
ఇళ్ల నుంచి వచ్చిన తర్వాత విద్యార్ధుల్లో స్వల్పంగా దగ్గు, జలుబు లక్షణాలు బయటపడడంతో.. మొత్తం 120 మంది విద్యార్ధులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు.. వారిలో 28 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఆ విద్యార్థుల్లో నలుగురు కోలుకోగా.. మిగతా వారు ఐసోలేషన్‌లో ఉన్నారు. 
 
అయితే, విద్యార్ధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన పర్యవేక్షణలో ఉంచామని.. కోవిడ్ కేసుల దృష్ట్యా ప్రస్తుతం శిక్షణా తరగతులు నిలిపివేశామని ప్రకటించారు ఐటీడీఏ పీవో శ్రీధర్.