సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (10:28 IST)

జూన్ 15 కరోనా బులిటెన్ : 61 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గిపోతోంది. ఇందులోభాగంగా, క‌రోనా కేసుల సంఖ్య 75 రోజుల త‌ర్వాత 61 వేల దిగువ‌కు చేరింది. సోమవారం 60,471 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 
 
దాని ప్రకారం... సోమవారం 1,17,525 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,70,881కు చేరింది. మరో 2,726 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,77,031కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,82,80,472 మంది కోలుకున్నారు. 9,13,378 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,90,44,072 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,13,75,984 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. సోమవారం 17,51,358 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.