శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (09:27 IST)

హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర... ఈ రోజు ధరలు ఇవే...

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. ఫలితంగా ఈ చమురు ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ.97కి దగ్గరగా ఉండగా, హైదరాబాద్‌లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కు దాటేయడం గమనార్హం.
 
ఎక్కడో ఉన్న పెట్రో ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. మంగళవారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఓసారి పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100.20 గా ఉంది. ఇదేసమయంలో లీటర్ డీజిల్ ధర రూ.95.14గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100.34 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.26గా ఉంది. 
 
ఇకపోతే, విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.102.56కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.87గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.101.35 ఉండగా.. డీజిల్ ధర రూ.95.72గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.78 గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.10గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 102.56 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.87 లకు లభిస్తోంది.
 
ఇక దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లోని ధరలను పరిశీలిస్తే, ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.96.41గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.28లకు లభిస్తోంది. ఇదేసమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.58కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.70 గా ఉంది. 
 
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.34 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ.90.12 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.97.69ఉండగా.. డీజిల్ ధర రూ.91.92గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.63 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.92.53గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.68 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.72గా ఉంది.