శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 జూన్ 2021 (09:42 IST)

దేశంలో కొత్తగా 81 వేల పాజిటివ్ కేసులు... 3 వేల మృతులు

దేశాన్ని వణికించిన కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖంపడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 81 వేలకు దిగువన కేసులు దిగువన కేసులు నమోదుకాగా, 71 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. మరోసారి మూడువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో 80,834 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. కొత్తగా 1,32,062 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,303 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు వదిలారు. 
 
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,94,39,989కు పెరిగింది. ఇందులో మొత్తం 2,80,43,446 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 3,70,384 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 10,26,159 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొన్నారు. 
 
టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 25,31,95,048 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.26 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతానికి దిగువకు పడిపోయిందని తెలిపింది. 
 
ప్రస్తుతం 4.74 శాతంగా ఉందని, రోజువారి పాజిటివిటీ రేటు 4.25శాతంగా ఉందని, వరుసగా 20వ రోజు పది కన్నా తక్కువన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 37.81 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.