సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (16:37 IST)

సోనూకు పద్మవిభూషణ్ ఇవ్వాలి.. బ్రహ్మాజీ ట్వీట్‌పై హీరో ఏమన్నారంటే?

కరోనా కల్లోలం ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఎంతోమందికి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సేవలు అందిస్తూనే ఉన్నారు. గతేడాది వలస కూలీల కోసం ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసిన సోనూసూద్‌.. ఇప్పుడు కరోనా బాధితుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులను సరఫరా చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా తనని సాయం కోరిన ప్రతి ఒక్కరికీ ఆయన ఆపన్నహస్తం అందిస్తున్నారు.
 
ప్రతిష్టాత్మక ‘పద్మవిభూషణ్‌’ అవార్డును సోనూసూద్‌కు ఇవ్వాలని కోరుతూ టాలీవుడ్‌ నటుడు బ్రహ్మాజీ ఓ ట్వీట్‌ పెట్టారు. కొంతకాలంగా సోనూ చేస్తున్న నిర్విరామ సేవలను గుర్తించి ఈ అవార్డుతో గౌరవించాలని అభిప్రాయపడ్డారు. బ్రహ్మాజీ పెట్టిన ట్వీట్‌పై సోనూ స్పందిస్తూ.. "బ్రదర్‌.. 135 కోట్ల మంది భారతీయుల ప్రేమను పొందడమే గొప్ప అవార్డు. ఇప్పటికే నేను ఆ అవార్డును పొందాను" అని రిప్లై ఇచ్చారు. భారతీయుల ప్రేమను పొందడమే గొప్ప అవార్డని పేర్కొన్నారు.