శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (18:03 IST)

సంజయ్ రావ్ హీరోగా `గుట్టు చప్పుడు` ఫస్ట్ లుక్

Hero Sanjay Rao
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు `ఓ పిట్ట కథ` ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త దర్శకుడు మణీంద్రన్ దర్శకత్వంలో గుట్టు చప్పుడు` రూపొందుతోంది. డాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తున్నారు. శ‌నివారం. మే 29న హీరో సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ని సంతోషం స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యుల మధ్య హీరో సంజయ్ రావ్ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. 
 
సంజయ్ రావ్ మాట్లాడుతూ, గుట్టు చప్పుడు సినిమా నాకు చాలా మంచి ఇమేజ్ తెస్తుంది. నేను చేసిన పిట్టకథ సినిమాలోని పాత్రకు ఇది పూర్తీ ఆపోజిట్ గా ఉంటుంది ప్రతి సీన్, షార్ట్ డివిజన్, మ్యూజిక్..ఇలా అన్ని అంశాలతో కథను చెప్పారు . కథ కూడా  చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పక్కా మాస్ అండ్ లవ్ ఎంటర్ టైనర్.. అన్నిరకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి .ఈ చిత్రాన్ని త్వరలోనే మీ ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. 
 
నిర్మాత లివింగ్ స్టన్ మాట్లాడుతూ, మా కాంబినేషన్ లో సినిమా చేయాలనీ అనుకున్నప్పుడు చాలా కథలు అనుకున్నాం.. కానీ గుట్టు చప్పుడు కథ నాకు బాగా నచ్చింది.  కథను అల్లిన విధానం బాగుంది .. అందుకే ఈ సినిమా మొదలెట్టాం.. ఇక ఈ సినిమాలో హీరోగా బ్రహ్మాజీ వాళ్ళ అబ్బాయి నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కరోనా పరిస్థితులు చక్కబడ్డాకా మిగిలిన షెడ్యూల్స్ మొదలెడతాం. తప్పకుండా అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం  అన్నారు. 
 
దర్శకుడు మణీంద్రన్ మాట్లాడుతూ,  కొత్త తరహా కథతో చాలా విభిన్నమైన దిశగా కథ ఉంటుంది. తప్పకుండా నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా, ముక్యంగా యూత్ ని బేస్ చేసుకుని చేస్తున్న సినిమా ఇది. కథ విని వెంటనే ఓకే చెప్పడంతో హీరోతో సినిమా మొదలెట్టాం. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసాం.. ఒక షెడ్యూల్ వైజాగ్, రెండో షెడ్యూల్ ని హైద్రాబాద్ లో షూట్ చేశాం. ఈ సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. 
మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి మాట్లాడుతూ, ఇది చాలా మంచి కథ.. ఇలాంటి కథకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ .. దర్శకుడు మణీంద్రన్ పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తున్నాడు  తప్పకుండా మా టీం అందరికి మంచి హిట్ ఇచ్చే చిత్రం అవుతుంది అన్నారు. 
 
మాటల రచయిత సురేష్ కుమార్ మాట్లాడుతూ, నేను ఇప్పటికే శివరంజని, దేవరకొండ లో విజయ్ ప్రేమకథ చిత్రాలకు పనిచేసాను, ఇది నా మూడో సినిమా. దర్శకుడు మణీంద్రన్ చాలా కొత్త కథను చెప్పాడు .. సినిమాకు సరైన కథ ఉంటేనే దానికి డైలాగ్స్ మరింత బలాన్ని ఇస్తాయి. చాలా చక్కని డైలాగ్స్ కుదిరాయి. తప్పకుండా ఈ సినిమాతో నాకు మరింత మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.