గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 20 అక్టోబరు 2020 (14:58 IST)

యాక్టర్ బ్రహ్మాజీపై ఫైర్ అవుతున్న నెటిజన్లు, ఏమైంది..?

యాక్టర్ బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు తనదైన శైలిలో సెటైర్ వేస్తుంటారు. తోటి నటీనటులపై జోకులు వేస్తుంటారు. అయితే... సోషల్ మీడియాలో హైదరబాద్ వర్షాల గురించి బ్రహ్మాజీ స్పందించిన తీరుపై మండిపడుతున్నారు.
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... నేను మోటరు బోటు కొనుక్కోవాలనుకుంటున్నాను. దయచేసి సలహా ఇవ్వండి అన్నాడు. అంతే... హైదరాబాద్‌లో వర్షాల వలన జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే.. నువ్వు ఇలా జోకులు వేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. విషయం సీరియస్ అవుతుండటాన్ని గమనించిన బ్రహ్మాజీ హైదరాబాద్ వరదల్లో తన ఇల్లు కూడా మునిగిందని తెలిపాడు.
 
బ్రహ్మాజీ ఈ మేరకు తన ఇంటి ఫొటోలు.. ఇంటి ముందర మునిగిన కార్ల ఫొటోలను షేర్ చేశాడు. అయినా నెటిజన్లు ఊరుకోలేదు. కొంతమంది అయితే... హైదరబాద్‌ని విమర్శించే వాళ్లకి ఇక్కడే ఉండే అర్హత లేదంటూ కాస్త సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రలో, చెన్నైలో వరదలు వస్తే... సాయం చేస్తారు. హైదరాబాద్‌లో వర్షాలు పడుతుంటే.. ఇలా కామెడీ చేస్తారా అని నిలదీస్తున్నారు.
 
 మొత్తానికి బ్రహ్మాజీ ఏదో అనుకుంటో ఇంకేదో అయ్యింది. అందుకనే ఇలాంటి సున్నిత విషయాల గురించి పోస్ట్ చేసేటప్పుడు బాగా ఆలోచించి చేయాలి.