గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (21:59 IST)

గురుడుకి ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ వుంటే ఇక ఆటలో వీర బాదుడే బాదుడు.. ఎవరు?

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
కరోనావైరస్ దెబ్బకు గ్యాలరీల్లో జనం లేకపోయినా ఐపీఎల్ 2020 మాత్రం జనం వున్నట్టే అనిపించేంత జోరుగా సాగుతోంది. ప్రతి జట్టులోనూ మెరికల్లాంటి ఆటగాళ్లు తమ ఆటతీరును ప్రదర్శిస్తూ ఐపీఎల్ క్రీడాభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. ఈ కరోనావైరస్ కాలంలో ఉసూరుమంటూ వున్న జనానికి టీవీలో కాస్త ఆటవిడుపును అందిస్తున్నారు.
 
ఇదంతా ఒక ఎత్తయితే ఐపీఎల్ క్రీడల్లో ఆడే ఆటగాళ్లు, వారి గర్ల్ ఫ్రెండ్స్ గురించి చర్చించుకోవడం నెటిజన్లుకు మామూలే. మరీ ముఖ్యంగా కరేబియన్ ఆటగాళ్ల గురించీ, వారి గర్ల్ ఫ్రెండ్స్ గురించి అయితే మరీ లోతుగా చర్చలు చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడుతున్న హెట్మయిర్ గురించి విపరీతంగా మాట్లాడుకుంటున్నారు.

అతడితో ఆపేయడం లేదు, అతడి గర్ల్ ఫ్రెండ్ నిర్వానీ వుమ్‌రావ్ గురించీ, ఆమె హెట్మయిర్ తో కలిసి వున్న ఫోటోలను షేర్ చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. గురుడుకి ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ వుంటే ఇక ఆటలో వీర బాదుడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వాళ్ల నమ్మకాన్ని జట్టులో ఎంతమేరకు నిలబెడతాడో ఈ కరేబియన్ వీరుడు, చూడాల్సిందే.