మంగళవారం, 16 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2025 (12:11 IST)

కొత్త జంట.. అలా కారులో ముద్దుపెట్టుకుంటే.. సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.. చివరికి?

couple
ఉత్తరప్రదేశ్‌లో ఓ జంట ముద్దు పెట్టుకోవడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇదే వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అక్టోబర్ 25న లక్నోకు చెందిన ఒక నూతన దంపతులు అజంగఢ్ నుండి లక్లక్‌కు ప్రయాణిస్తుండగా.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజాకు చేరుకునే ముందు, వారు తమ కారును రోడ్డు పక్కన ఆపారు. వారు ఒక ప్రైవేట్ స్థలంలో ఉన్నారని భావించి, ఆ జంట కారు లోపల ముద్దు పెట్టుకోవడం ప్రారంభించారు. 
 
కానీ టోల్ మేనేజర్ అశుతోష్ బిశ్వాస్ వారిని సిసిటివి కెమెరా ద్వారా గమనించాడు. అతను జూమ్ చేసి వారికి తెలియకుండానే వారి ప్రైవేట్ క్షణాన్ని రికార్డ్ చేశాడు. ఆపై అతను తన బైక్‌పై వారి వద్దకు వెళ్లి వారిని బెదిరించాడు. అతను ఆ జంట నుండి ముప్పై రెండు వేల రూపాయలు తీసుకున్నాడు. తరువాత ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియోను షాక్ ఆ దంపతులు షాకయ్యారు. 
 
ఈ వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. టోల్ మేనేజర్ చాలా తప్పు చేశాడని, అతనిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరి ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేయడం లేదా పంచుకోవడం తీవ్రమైన ఉల్లంఘన అంటూ మండిపడుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. 
 
త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అలాగే ప్రైవేట్ క్షణాలను ఇలా బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదు. ఇటువంటి పరిస్థితులు బ్లాక్‌మెయిల్ లేదా దుర్వినియోగానికి దారితీయవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండటం ఎల్లప్పుడూ సురక్షితమని పోలీసులు సూచిస్తున్నారు.