మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (19:55 IST)

అమేజాన్ స్కూల్ ఫ్రమ్ హోమ్ స్టోర్.. ల్యాప్స్, టాబ్లెట్లు, ఫోన్లు..

దేశమంతటా కొత్తగా 'స్కూల్ ఫ్రమ్ హోమ్' సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో Amazon.in నేడు 'School from Home' స్టోర్­లోను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ స్టోర్, ఇంటి వద్దనే ప్రభావవంతమైన విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సహకరించే, విద్య, వ్రాత కోసం అవసరమైన ఉత్పత్తులు, స్టేషనరీ, ల్యాప్­టాప్­లు, టాబ్లెట్లు, మొబైల్ ఫోన్లు, పిసిలు, బెడ్­సెట్­లు మరియు స్పీకర్లు, అమెజాన్ ఉపకరణాలు, ప్రింటర్ మరియు హోమ్ ఫర్నిషింగ్ వంటి పలు సామాగ్రులతో కూడిన విస్తృత శ్రేణిని ఆఫర్ చేస్తోంది.
 
అమెజాన్ షాపంగ్ యాప్ (యాండ్రాయిడ్ మాత్రమే) పై అలెక్సాను ఉపయోగించి స్వరంతోనే కస్టమర్లు స్టోర్­ను సులభంగా చేరుకుని, అందులో సంచరించగలుగుతారు. యూజర్లు, యాప్ పై ఉన్న మైక్ ఐకన్­ను ట్యాప్ చేసి, - 'అలెక్సా, గో టు స్కూల్ ఫ్రమ్ హోమ్ స్టోర్' అని చెబితే చాలు, దేన్ని క్లిక్ చేయకుండానే స్టోర్­లోకి చేరుకుని, పాఠశాల కోసం అవసరమైన ల్యాప్­టాప్­లు, టాబ్లెట్లు మరియు పిసిలు, హెడ్­సెట్లు మరియు స్పీకర్లు, అమెజాన్ ఉపకరణాలు, ప్రింటర్, స్టడీ టేబుళ్ళు మరియు కుర్చీలు, ఇంకా మరెన్నో వస్తువుల పై ఆఫర్లను పొందవచ్చు.