గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 24 మే 2021 (19:49 IST)

అమెజాన్ ఇండియా: ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, అర్హులైన ఉద్యోగులకు కోవిడ్‌-19 ఉపశమన పథకం

మహమ్మారితో తమ పోరాటాన్ని దేశం కొనసాగిస్తోన్న వేళ, తమ ఉద్యోగులు మరియు ఫ్రంట్‌లైన్‌ బృందాలకు మద్దతునందిస్తూ ప్రారంభించిన పలు కార్యక్రమాలతో పాటుగాఅమెజాన్‌ ఇండియా ఇప్పుడు కోవిడ్‌-19 ఉపశమన పథకం (సీఆర్‌ఎస్‌)ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా, అమెజాన్‌ ఇండియా ఇప్పుడు అదనపు ఆర్ధిక సహకారాన్ని ఫ్రంట్‌లైన్‌ బృందాలతో పాటుగా స్టాఫింగ్‌ ఏజెన్సీల ద్వారా నియమితులైన అసోసియేట్లు, ఇతర అర్హులైన ఉద్యోగులకు కోవిడ్‌-19 భత్యంతో పాటుగా అదనంగా హాస్సిటల్‌ పరిహారం కూడా అందిస్తారు.
 
కోవిడ్-19 భత్యంను ఉద్యోగులకు ఒకసారి మాత్రమే అందిస్తారు. ఇంటిలో ఉండి కోవిడ్‌ చికిత్స పొందిన వారికి 30,600 రూపాయలను భత్యాన్ని వైద్య యంత్రసామాగ్రి లేదా సంబంధిత ఔషదాల సంబంధిత ఖర్చులకు అందిస్తారు. కోవిడ్-19 కారణంగా ఒకవేళ ఆస్పత్రిలో చేరి ఉద్యోగుల ఆరోగ్య భీమాను మించి ఖర్చు చేయాల్సిన వేళ అమెజాన్‌ ఇండియా ఆ తరహా ఉద్యోగులకు అదనంగా 1,90,000 రూపాయల వరకూ రీఇంబర్స్‌ చేస్తుంది.
 
కోవిడ్‌-19 ఉపశమన పథకంతో పాటుగా అమెజాన్‌ ఇండియా ఇప్పుడు ఫ్రంట్‌లైన్‌ బృందాలు మరియు ఉద్యోగులకు అవసరమైన మద్దతును ఈ సంక్షోభ సమయంలో అందించనుంది. స్టాఫింగ్‌ ఏజెన్సీల ద్వారా పలు ప్రాంతాలలో పనిచేసే ఫ్రంట్‌లైన్‌ అసోసియేట్లు ఒక నెల జీతం అడ్వాన్స్‌గా కోవిడ్‌-19 సంబంధిత ఆరోగ్య సంరక్షణ మరియువైద్య చికిత్స కోసం పొందేందుకు అర్హులు. అలాగే ఒకవేళ క్వారంటైన్‌ కావాల్సి వస్తే వారికి జీతం చెల్లించి మరీ సెలవు మంజూరు చేస్తారు. 
అమెజాన్‌ ఇండియా ఇప్పుడు వైద్య బీమాతో పాటుగా ఈఎస్‌ఐసీ ప్రయోజనాలను తమ అసోసియేట్లు అందరికీ, ఆఖరకు స్టాఫింగ్‌ ఏజెన్సీల ద్వారా నియమించబడినా సరే అందిస్తుంది. ప్రభుత్వం సూచించిన కంటెయిన్‌మెంట్‌ జోన్‌లలో నివాసముంటున్న ఫ్రంట్‌లైన్‌ అసోసియేట్లకు స్థానిక అవరోధాల కారణంగా విధులకు హాజరుకాని ఎడల 7500 రూపాయల వరకూ సస్టెనెన్స్‌ అందిస్తారు. అంతేకాదు, ఈ బృందాలకు టెలికన్సల్టేషన్‌ మరియు ఆన్‌లైన్‌ మెడికల్‌ సహాయ పరిష్కారాలు సైతం పెయిడ్‌ సేవగా అందుబాటులో ఉండటంతో పాటుగా ఎంప్లాయీ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఈఏపీ) ద్వారా ఉచిత కౌన్సిలింగ్‌ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
 
కోవిడ్-19 వారియర్‌ బృందాలు సైతం లభ్యం కావడంతో పాటుగా కోవిడ్‌-19 సంబంధిత అత్యవసర పరిస్థితులలో తక్షణ సహాయాన్ని వీరు అమెజాన్‌ వద్ద ఫ్రంట్‌ లైన్‌ కార్మికులందరికీ అందిస్తారు. వీటితో పాటుగా కోవిడ్‌-19 బారిన పడి విజయవంతంగా కోలుకున్న అమెజాన్‌ ఉద్యోగులు బ్లడ్‌ ప్లాస్మా దాతలుగా స్వచ్ఛందంగా సేవలనందించడానికి ముందుకు రావడంతో పాటుగా తమ సహచర ఉద్యోగులు, అసోసియేట్లతో కనెక్ట్‌ అవుతారు.
 
వైద్యభీమా మద్దతును డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ అసోసియేట్లందరికీ అందిస్తారు. అలాగే ఐ హావ్‌ స్పేస్‌ భాగస్వాములకు సైతం ఈ మద్దతు లభిస్తుంది. ఇది అమెజాన్‌ రిలీఫ్‌ ఫండ్‌ (ఏఆర్‌ఎఫ్‌)కు అదనం. డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌, అమెజాన్‌ ఫ్లెక్స్‌ ప్రోగ్రామ్‌ మరియు ట్రకింగ్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌లలో భాగం కావడంతో పాటుగా కోవిడ్‌-19 కారణంగా ఆర్థికంగా కష్టాల బారిన పడిన అర్హత కలిగిన డెలివరీ అసోసియేట్లు కోసం ఏర్పాటుచేసిన 25 మిలియన్‌ డాలర్ల ఉపశమన నిధి ఏఆర్‌ఎఫ్‌. 
 
అమెజాన్‌ ఇండియా ఆపరేషన్స్‌ హెచ్‌ఆర్‌  డైరెక్టర్‌ స్వాతి  రస్తోగి మాట్లాడుతూ, ‘‘వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పలు ఉత్పత్తులను వారి ఇంటి వద్దనే మా ఫ్రంట్‌లైన్‌ బృందాలు డెలివరీ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కారణంగా ప్రభావితమైన మా అసోసియేట్స్‌ నెట్‌వర్క్‌కు అవసరమైన ఆర్థిక, వైద్యసహాయం అందించాలనే లక్ష్యంతో దీనిని సృష్టించాం. ఈ కోవిడ్-19 ఉపశమన పథకంతో, తాము అదనపు భద్రత, ఆర్థిక, ఆరోగ్య, భీమా భరోసా అందిస్తూనే మా ఫ్రంట్‌లైన్‌ బృందాలు, అర్హత కలిగిఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన వారికి తగిన రక్షణనూ అందిస్తుంది..’’ అని అన్నారు.
 
వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవడానికి తమ ఉద్యోగులు మరియు ఫ్రంట్‌లైన్‌ బృందాలను అమెజాన్‌ ఇండియా ప్రోత్సహిస్తుంది. అంతేకాదు తమ బృందాలకు టీకాను రెడీ ఛాయిస్‌గా కూడా నిలుపుతుంది. ఫ్రంట్‌లైన్‌ బృందాలతో ఇప్పటికే ఆన్‌సైట్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను ప్రారంభించింది. త్వరలోనే మిగిలిన ఉద్యోగులకు కూడా విస్తరించనుంది. అంతేకాదు, స్టాఫింగ్‌ ఏజెన్సీల ద్వారా పనిచేసేటటువంటి అసోసియేట్లకు ప్రత్యేకంగా 1500 రూపాయలను రెండు మోతాదుల టీకా అందుకున్న ఎడల కంపెనీ అందిస్తుంది. ఈ కంపెనీ అదనంగా తమ అసోసియేట్లు, ఉద్యోగుల కోసం టీకాలను అందించడంతో పాటుగా ఆస్పత్రిలకు సులభంగా చేరుకునే అవకాశం అందిస్తూనే పలు ఇతర మార్గాల ద్వారా రీఇంబర్స్‌మెంట్లనూ చేస్తుంది.
 
అమెజాన్‌ ఇండియా ఇటీవలనే తమ భారతీయ ఉద్యోగులు, విక్రేతలు, అసోసియేట్లుతో పాటుగా తమ ఆపరేషన్స్‌ భాగస్వామ్య నెట్‌వర్క్‌లో భాగమైన డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ (డీఎస్‌పీ) అసోసియేట్లు సహా అమెజాన్‌ ఫ్లెక్స్‌ డ్రైవర్లు, ఐ హావ్‌ స్పేస్‌ (ఐహెచ్‌ఎస్‌)స్టోర్‌ పార్టనర్స్‌, ట్రకింగ్‌ భాగస్వాములు  మరియు వారి అర్హత కలిగిన డిపెండెండ్లు సహా 10 లక్షల మందికి కోవిడ్‌-19 టీకా ఖర్చును భరించనున్నట్లు వెల్లడించింది.