సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (17:29 IST)

30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో `వ‌కీల్‌సాబ్‌`

Vakeel sab primelo
ప‌వ‌న్ క‌ళ్యాణ్ `వ‌కీల్‌సాబ్‌` ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల‌కానుంది. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారంనాడు సంస్థ సౌత్‌జోన్ ప్ర‌తినిధులు ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. జాతి ర‌త్నాలు ప్రైమ్‌లో విడుద‌ల‌య్యాక అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింద‌నీ, ఇప్పుడు వ‌కీల్‌సాబ్ విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా వుంద‌ని తెలియ‌జేస్తున్నారు.
 
వ‌కీల్‌సాబ్ ప‌రంగా చెప్పాలంటే, ముగ్గురు అమ్మాయిల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, వారి మొండి ప‌ట్టుద‌ల‌, ఆ త‌ర్వాత దానికి కార‌ణ‌మైన అహంకార యువ‌కుడి వ‌ల్ల వారి జీవితంలో ఏం జ‌రిగింద‌నేది వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా మ‌లిచారు. పింక్ రీమేక్ అయినా దాన్ని కొద్ది మార్పుల‌తో దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ,, అమెజాన్‌లో విడుద‌ల కావ‌డం ఆనందంగా వుంది. సినిమా హాల్ల‌లో చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఇక క‌రోనా సెకండ్ వేవ్‌లో చాలా మంది చూడ‌లేక‌పోయారు. క‌నుక డిజిట‌ల్  మీడియా ద్వారా మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతుంద‌ని తెలిపారు.

 
క‌రోనా టైంలో అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యేలా కోర్టు రూమ్ డ్రామా సినిమా వ‌కీల్‌సాబ్‌ను ప్రైం వీడియో ద్వారా తీసుకు వ‌స్తున్నామ‌ని అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇండియా కంటెంట్ డైరెక్ట‌ర్ హెచ్‌. విజ‌య్ సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు. నివేదాతామ‌న్‌, అంజ‌లి, అన‌న్య ముగ్గురు మ‌హిళ‌లుగా న‌టించారు. శ్రుతిహాస‌న్ లాయ‌ర్ సాబ్ భార్య‌గా న‌టించింది.