శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (18:24 IST)

ఏపీలో కరోనా బులిటెన్ : కొత్తగా 5741 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 5741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 96,153 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,741 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ముఖ్యంగా, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 831 కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 830 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 130 కేసులు గుర్తించారు.
 
ఇక తాజాగా రాష్ట్రంలో 53 కరోనా మరణాలు సంభవించగా, ఒక్క చిత్తూరు జిల్లాలోనే 12 మంది చనిపోయారు. తాజా మరణాలతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 12,052కి చేరింది.
 
అదే సమయంలో 10,567 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 18,20,134 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,32,948 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 75,134కి తగ్గింది.