శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (19:29 IST)

విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత.. పుణ్యరాశి పెరుగుతుందట..

విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టతను గురించి తెలుసుకుందాం. రోజుకు కనీసం ఒక్క సారైనా విష్ణుసహస్ర నామ పారాయణం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం. విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును, పాపములు తొలగును. 
 
స్తోత్రములో ప్రతి నామము అద్భుతం. మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. 
 
అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు.