మామిడి టెంకను పొడి కూరల్లో వాడితే ఎంతో మేలు.. తెలుసా?
Mango Seed Health Benefits
మామిడి టెంకను పొడి చేసుకుని కూరల్లో వాడితే వేసవి తాపంతో ఏర్పడే రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చు. వెల్లుల్లి, ఉల్లి, టమోటాను బాగా వేయించుకుని అందులో మామిడి టెంక పొడిని చేసి కూరలా తయారు చేసి.. వేడి వేడి అన్నంలో నాలుగైదు ముద్దలు తీసుకుంటే శరీర వేడిమి తగ్గుతుంది. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. ఇంకా మామిడి టెంకను పొడి చేసుకొని జీలకర్ర, మెంతుల పొడితో సమానంగా కలిపి వండి వేడి వేడి అన్నంతో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.
ఉదర సంబంధ వ్యాధులకు మామిడిటెంక మంచి ఔషధం మామిడిటెంక పొడిని మజ్జిగలో కలిపి కాస్త ఉప్పు చేర్చి తాగితే కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి టెంకలోని గింజను చూర్ణం చేసి రోజుకు మూడు గ్రాముల చొప్పున తేనెతో కలిపి సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. దగ్గు సమస్యలు తగ్గుతాయి.
మామిడిటెంకలోని జీడిని పొడి చేసి దాన్ని మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. మామిడిటెంకలోని ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ జుట్టుకు పోషణనిస్తాయి. తెల్లబడే జుట్టుకు చెక్ పెట్టాలంటే మామిడిటెంక పొడిలో కొబ్బరి, ఆలీవ్, ఆవనూనెలు కలిపి వెంట్రుకలకు పట్టించాలి. మామిడి టెంక పొడిలో వెన్న కలిపి ముఖానికి ఐప్లె చేస్తే చర్మం మెరిసిపోతుంది.