సోమవారం, 4 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (23:16 IST)

ఉసిరితో డయాబెటిస్ మటాష్.. తేనెతో కలుపుకుని తాగితే..?

ఆయుర్వేదంలో ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. సిట్రస్ ఫలమైన ఉసిరిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. అందువల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది. కంటిచూపును మెరుగుపరచడానికి ఉసిరి బాగా సహకరిస్తుంది. కంటి శుక్లాలను తొలగించడంలో దీని పాత్ర అమోఘం. దీనికోసం ఉసిరి పొడిని తేనెతో కలుపుకుని తాగడం మంచిది.
 
ప్రస్తుతం డయాబెటిస్ కామనైపోయింది. ప్రతీ యేటా డయాబెటిస్ వ్యాధిన బారిన పడ్డవారు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఉసిరి రసాన్ని తేనెలో కలుపుకుని తాగితే బాగుంటుంది. 
 
అసిడిటీ ఇబ్బందితో బాధపడుతున్నవారు ఉసిరి, చక్కెర కలుపుకుని తిన్నా సరిపోతుంది. లేదంటే నీటిలో కలుపుకుని తాగినా మంచిదే. ఇంకా ఉసిరి కాయ జ్యూస్ తాగితే కడుపుకి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.