గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (10:39 IST)

దేశంలో 2 లక్షల దిగువకు కరోనా కేసులు.. 44 రోజుల కనిష్ట స్థాయికి

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. 2 లక్షలకు దిగువకు పడిపోయింది. ఇది 44 రోజుల కనిష్ట స్థాయికి సమానం. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,86,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 
 
ఆ ప్రకారంగా గురువారం 2,59,459 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,75,55,457కు చేరింది. మరో 3,660 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,18,895కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,48,93,410 మంది కోలుకున్నారు. 23,43,152 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,57,20,660 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
మరోవైపు, దేశంలో గురువారం వరకు 33,90,39,861 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఒక్క గురువారమే 20,70,508 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.