మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 మే 2021 (11:27 IST)

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తగ్గినట్లే తగ్గి 24గంటల్లో 2లక్షలకు పైగా..?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో 2,11,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రెండు రోజుల క్రితం 2లక్షల లోపు పడిపోయిన కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ రెండు లక్షలకు పైగా నమోదు అవుతున్నాయి. 3,847 మంది మృతి చెందారు. డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 2,83,135 గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన 'కరోనా' పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 గా ఉంది.
 
దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 24,19,907 గా ఉండగా 'కరోనా' కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,46,33,951 గా ఉంది. 'కరోనా' వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,15,235 గా ఉండగా దేశంలో 89.66 శాతం రికవరీ రేటు ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.19 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.15 శాతంగా ఉంది.