బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (22:10 IST)

వేసవిలో వడదెబ్బ తగలకుండా వుండాలంటే.. ఉల్లిని పచ్చిగా..?

వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే పడుకునే ముందు ఉల్లిపాయ తినాలి. ఇలా చేస్తే వడదెబ్బ తగిలే అవకాశం చాలా తక్కువ. ఉల్లిపాయలను పచ్చిగా నమిలి తీసుకోవడం చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవు. బీపీ నియంత్రణలో లేకపోతే రోజూ రెండు ఉల్లిపాయలు తింటే బాగుంటుందని చెబుతున్నారు.

జలుబు, కఫం ఇబ్బందికరంగా మారినపుడు ఉల్లిపాయతో చేసిన రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుతువు మారినప్పుడు కామన్‌గా వచ్చే వాటిల్లో జలుబు ఒక్కటి కాబట్టి, ఉల్లిపాయ రసం తాగండి.
 
ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉల్లిపాయ కీలక పాత్ర వహిస్తుంది.

రక్తంలోని అనేక విష పదార్థాలన్ను శరీరం నుండి వేరు చేసి, వాటివల్ల చర్మం మీద ఏర్పడే మొటిమలు, మచ్చలని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.