రజనీకాంత్ నటనకు గుడ్‌బై చెప్పనున్నారా!
Rajani kanth
వయస్సురీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలవల్ల ఆమధ్య రాజకీయాల్లోకి కూడా వెళ్ళవద్దని ఇదే హైదరాబాద్ షూటింగ్ ముగించుకుని ఫస్ట్ షెడ్యూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు రజనీ కుటుంబ సభ్యులు రాజకీయాలకూ దూరంగా వుండమని సలహా ఇచ్చారు. ప్రస్తుతం వయస్సురీత్యా ఇంకా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. యాక్టింగ్ అంటే నవరసాలు కృత్రిమంగా పండించాలి. అలా చేసేటప్పుడు బాడీలోని లోపల భాగాలు ఉద్వేగానికి గురవుతాయి. దానివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే శోభన్‌బాబు ముందుగానే రిటైర్ తీసుకున్నారు. దాదాపు 46 ఏళ్ళనుంచి రజనీ నటిస్తూనే వున్నారు. పైగా కరోనా సద్దుమణిగాక రొటీన్‌గా అమెరికా వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
