ప్రియుడి చేతిలో టెక్కీ హత్య.. మోసం చేసిందని గోడకు తలను బాదాడు.. రాత్రంతా శవం పక్కనే...?
Lover
వారిద్దరూ పక్కపక్కనే ఉన్న పేయింగ్ గెస్ట్ వసతి గృహాలలో నివసించేవారు. కోమల్ తనను మోసం చేసిందనే అనుమానంతో శుభం తరచుగా ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆ యువతి అతనితో కలిసి రాత్రి భోజనానికి బయటకు వెళ్లింది.
కోమల్ తన పీజీ వసతి గృహానికి తిరిగి వచ్చిన తర్వాత, వారిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో ఆవేశానికి గురైన శుభం ప్రియురాలితలను గోడకు బాది హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
నిందితుడు రాత్రంతా మృతదేహం పక్కనే కూర్చున్నాడు. ఉదయం శుభం అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

