రజనీకాంత్ మనిషి కాదంటున్న బాల సెన్సేషనల్ కామెంట్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే `అన్నాతై` షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని ఫిలింసిటీకి వచ్చారు. కొద్దిరోజుల షూటింగ్ చేసిన తర్వాత యూనిట్‌లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే చిత్ర నిర్మాత సంస్థ షూటింగ్‌ను వాయిదా వేసింది. వెంటనే ఆయన చెన్నై వెళ్ళిపోయారు. ఆ సినిమాలో కీలక పాత్రలో బాట నటిస్తున్నారు. రజనీకాంత్ కాంబినేషన్‌లో నటించడం పట్ల ఆయన చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులోని పాత్ర కోసం బాల 17 కేజీలు తగ్గాల్సి వచ్చింది. అందుకోసం చాలా కష్టపడ్డానని బాల తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు ఐదు భాషల్లో 50 సినిమాలలో నటించాను. రజనీకాంత్ వంటి మహానటుడితో నటించడం చాలా ఆనందంగా వుంది. నేను ఆయనకు వీరాభిమానిని. అభిమానిని అయిన నేను చాలా దగ్గరగా ఆయన్న చూశా. ఆయన మనిషి కాదు మహానటుడు. ఆయనలో హాస్య చతురత వుంది. అలాంటి వ్యక్తి రాజకీయాలకు దూరంగా వుండడమే మంచిది. తమిళనాడు ఎన్నికల తర్వాత అందరూ ఇలా అనుకోవడం తెలిసింద గదా. అందుకే ఆయన ఇంకా ఎంటర్‌టైన్ చేయాలని అభిమానిగా కోరుకుంటున్నానని తెలిపారు.