గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మే 2021 (14:34 IST)

బేబమ్మకు క్యూ కట్టిన ఆఫర్లు.. ఆ హీరోకు నో చెప్పిందట!

ఉప్పెన భామ కృతిశెట్టి కూడా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ ఏడాది తన తొలి సినిమా ఉప్పెన సంచలనమే సృష్టించింది. రికార్డులు మొత్తం తిరగరాసింది. చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించింది.
 
దీంతో బేబమ్మకు ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే తను మాత్రం ఏది పడితే అది ఓకే చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. డైరెక్టర్‌, హీరో, కథ ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని కొన్నింటికే ఓకే చెప్తోంది. ఇప్పటికే చాలా సినిమాలను రిజెక్ట్ కూడా చేసిందట ఈ పిల్ల.
 
ఇప్పుడు వైవిధ్య సినిమాలకు పెట్టింది పేరైన తేజ ఓ సినిమా ఆఫర్ ఇస్తే తిరస్కరించిందంట. అదేంటి అంత పెద్ద డైరెక్టర్ ఆఫర్ ఇస్తే వద్దంటారా అనుకుంటున్నారు కదా. అవునండి తిరస్కరించింది. రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ తెరకెక్కిస్తున్న సినిమాలో బేబమ్మను తీసుకోవాలని అనుకున్నారట. 
 
కానీ ఆమె సున్నితంగా వద్దని చెప్పింది. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు సినిమాల్లో చేస్తోంది కృతి. సీనియర్ హీరోల పక్కన అవకాశాలు వస్తుండటంతో కొత్త హీరోతో రిస్క్ వద్దని అలా నో చెప్పింది. మొత్తానికి కెరీర్‌ను బాగానే ప్లాన్ చేసుకుంటోంది.