శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 మే 2021 (19:42 IST)

అభిరామ్ దగ్గుబాటితో కృతిశెట్టి.. శ్రీరెడ్డి కూడా ఆ చిత్రంలో నటిస్తుందా?

రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ దగ్గుబాటిని హీరోగా పరిచయం కానున్నాడు. తేజ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి సురేష్ ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'ఉప్పెన' ఫేం కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. 
 
ఈ సినిమాలో లవర్ బోయ్ గా కనిపించనున్నాడట అభిరామ్. డైరెక్టర్ తేజ చక్కటి లవ్ స్టోరీని తయారు చేసారట. ఈ స్టోరీ లైన్ కి నిర్మాత సురేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్. మరోవైపు శ్రీరెడ్డి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.