కొవిడ్ తగ్గాక ముద్దు, ముచ్చట ఉండొచ్చా..?
దేశంలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. ఇలాంటి సమయాల్లో ప్రజల్లో రకరకాల భయాలు, సందేహాలు. కొవిడ్ వచ్చి తగ్గిన వారిలో ఈ సందేహాలు ఇంకాస్త ఎక్కువ. కొత్త దంపతుల్లో మరీ ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా, కోవిడి బారిన తర్వాత కనీసం నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. ఆ తర్వాత శృంగార జీవితాన్ని కొనసాగించ వచ్చు. సాధారణంగా 15 రోజుల తర్వాత నెగెటివ్ వస్తుంది. ఆ తర్వాత వైరస్ సోకే అవకాశం ఉండదు. అయినా.. నెల రోజులు దూరంగా ఉండడం మంచిది
అదేసమయంలో ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండి, శారీరకంగా చురుకుగా ఉంటే పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అయినప్పటీ భార్యాభర్తల శృంగారనికి ఓ నెల రోజుల పాటు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అదేసమయంలో వైరస్ తీవ్రత మోస్తరు నుంచి అధికంగా ఉన్న పురుషుల వీర్యం/స్త్రీ అండం ఉత్పత్తి, నాణ్యత, చురుకుదనంపై కొంత ప్రభావం ఉంటుంది. ఇలాంటి సమస్యను కొందరు పురుషుల్లో గుర్తించాం. కొవిడ్ రోగుల్లో.. తీవ్ర జ్వరం, ఇన్‌ఫెక్షన్, హార్మోన్ల అసమతౌల్యం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి స్త్రీ/పురుషుల్లో ఇబ్బందులు వస్తున్నాయి.
అలాగే, పిల్లలు కనాలనుకునే వారు ముందుగా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండు డోసులూ పూర్తయిన 15 రోజుల వరకు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.