కరోనా వస్తే శృంగారంలో పాల్గొనవచ్చా.. లేదా?
కరోనా సోకినప్పుడు శృంగారంలో పాల్గొనాలా లేదా అన్నది చాలామందికి అనుమానమే. అయితే ఈ అనుమానాన్ని నివృత్తి చేస్తున్నారు డాక్టర్ సమరం. కరోనాకు, శృంగారానికి అస్సలు ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు. కరోనా వైరస్ అనేది కళ్ళు, ముక్కు, నోటి ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది కాబట్టి.. సెక్స్ చేయడం వల్ల రాదంటున్నారు.
ఒకవేళ ఇద్దరిలో ఒక వ్యక్తికి కరోనా ఉంటే భౌతికంగా దగ్గరకు వెళ్ళారు కాబట్టి వస్తుందంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎలాంటి అపోహకు గురికాకుండా చక్కగా శృంగారంలో పాల్గొనవచ్చంటున్నారు. ఆరోగ్యంగా వున్నవారు ముద్దులు పెట్టుకోవడం వల్ల కూడా కరోనా వస్తుందన్న అపోహ పూర్తిగా మానుకోవాలంటున్నారు.
ఒకవేళ ఇద్దరిలో ఒకరికి కరోనా ఉంటే ఆ వైరస్ వస్తుందంటున్నారు. అయితే భార్యాభర్తలిద్దరికి కరోనా సోకితే మాత్రం ఇద్దరూ డిప్రెషన్ నుంచి బయట పడాలంటే ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనవచ్చని.. అది శరీరంలో ఉత్సాహాన్ని నింపేందుకు కారణమవుతుందంటున్నారు.
అంతే కాకుండా ఫీల్ గుడ్ హార్మోన్స్ కూడా విడుదలవుతాయని.. భయం కాస్త తగ్గడానికి కూడా ఉపయోగకరంగా మారుతుందంటున్నారు. భార్యాభర్తలిద్దరూ హోం క్వారంటైన్లో ఉంటే ఇలా చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ఇక ఆరోగ్యవంతులుగా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళయితే శృంగారంలో పాల్గొంటే వారికి ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ విడుదలవుతాయంటున్నారు డాక్టర్ సమరం.