గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (18:23 IST)

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... మే 31వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వీలున్న అన్ని శాఖల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు (వర్క్ ప్రం హోమ్) కల్పించింది. గర్భిణీలు, వికలాంగ ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
కంటైన్‌మెంట్ జోన్‌లో నివసించే ఉద్యోగులు, అధికారులు కూడా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతినిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులు కోవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించింది. మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది.