తిరుమలలో ఇప్పట్లో లాక్‌డౌన్ లేదు - కానీ 15 మంది టిటిడి ఉద్యోగస్తులు కరోనాతో మృతి
తిరుమలలో ఇప్పట్లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. కరోనా బారిన పడిన టిటిడి ఉద్యోగస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే కరోనాతో 15 మంది టిటిడి ఉద్యోగస్తులు మరణించడం బాధాకరమన్నారు.
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలో కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక డార్మెటరీ ఏర్పాటు చేస్తున్నామని.. బర్డ్ ఆసుపత్రిని పూర్తిగా టిటిడి ఉద్యోగస్తులకే కేటాయించామన్నారు. కరోనా సోకిన టిటిడి ఉద్యోగస్తులందరికీ బర్డ్ లోనే చికిత్స అందించనున్నట్లు చెప్పారు. తిరుపతిలో కోవిడ్ కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనన్నారు టిటిడి ఛైర్మన్.
తిరుపతి రూరల్ ఎంపిడిఓ కార్యాలయంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ప్రజలకు మాస్క్‌లను పంపిణీ చేశారు టిటిడి ఛైర్మన్. తన పుట్టిన రోజు సంధర్భంగా టిటిడి ఛైర్మన్ కేక్ కూడా కట్ చేశారు.