శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (12:14 IST)

వర్క్ ఫ్రమ్ హోం : గూగూల్‌కు రూ.7400 కోట్ల ఆదా

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అనేక కంపెనీలు వర్క్ ప్రమ్ హోం సౌలభ్యాన్ని కల్పించాయి. ముఖ్యంగా, టెక్ సంస్థలన్నీ ఇదే విధానంతో ముందుకుసాగుతున్నాయి. అలాంటి వాటిలో గూగుల్ సంస్థ ఒకటి. ఈ సంస్థ తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం కల్పించడం వల్ల రూ.7400 కోట్లను ఆదా చేసింది.
 
ఈ మొత్తాన్ని ఉద్యోగులకు ఆహారం, వినోదం వంటి సౌకర్యాలు అందించడానికి ఖర్చుచేస్తూ వచ్చింది. ఇపుడు వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఈ మొత్తం ఆదా అయింది. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా తమ ఎంప్లాయిస్ ఇంటి నుంచి పని చేయడంతో ఈ అలవెన్సులు ఇప్పుడు ఉద్యోగులకు ఇవ్వలేదు. కాబట్టి కంపెనీకి ఆ డబ్బు మిగిలింది.
 
అదేసమయంలో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ట్రెండ్ పెరిగింది. దీనివల్ల ఆయా సంస్థలకు ఉద్యోగుల ఖర్చు భారీగా తగ్గింది. భారతీయ కంపెనీలతో సహా ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీలు మునుపటి కంటే ఆపరేషనల్ ఫ్రంట్ కోసం తక్కువ ఖర్చు చేయాలి. టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం వల్ల గత ఏడాదిలో రూ.7,400 కోట్ల మేర ఆదా అయింది.