గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (19:29 IST)

చెన్నైకు చేరుకున్న 'అన్నాత్త' .. హారతి ఇంట్లోకి ఆహ్వానించిన లతా రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్త. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, 2019లో మొద‌లైన ఈ చిత్ర షూటింగ్ క‌రోనా వ‌ల‌న న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో షూటింగ్ ప్రారంభించిన‌ప్పుడు సెట్‌లో కొంద‌రికి క‌రోనా రావ‌డంతో పాటు ర‌జ‌నీకాంత్ కూడా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. 
 
దీంతో షూటింగ్‌ను కొన్ని నెల‌ల పాటు వాయిదా వేశారు. ఇక నెల రోజుల క్రితం క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ షూటింగ్ తిరిగి మొద‌లు పెట్టారు. తాజాగా ర‌జనీపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు పూర్తికావడంతో ఆయ‌న ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమాన‌శ్ర‌యం నుంచి చెన్నైకి వెళ్లారు.
 
ర‌జ‌నీకాంత్ స‌తీమ‌ణి ల‌త ఆయ‌న‌కు హార‌తి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ ఎయిర్ పోర్ట్ ఫొటోలు, చెన్నై ఇంటికి వెళ్లిన స‌మ‌యంలో తీసిన‌ వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 
 
ఇక ఈ వారంలో 'అన్నాత్త' డ‌బ్బింగ్ పూర్తి చేసి ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ మెడిక‌ల్ చెక‌ప్ కోసం అమెరికా వెళ్ల‌నున్న‌ట్టు ప‌లు వార్తలు వ‌స్తున్నాయి. కాగా, ధ‌నుష్ ఓ హాలీవుడ్ చిత్రీక‌ర‌ణ కోసం ఇటీవ‌ల అమెరికా వెళ్ల‌గా ఆయ‌నతో పాటు ఐశ్వ‌ర్య, పిల్ల‌ల‌ను కూడా తీసుకెళ్లార‌ట‌.