శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 11 మే 2021 (16:30 IST)

ట్యూషన్‌కి వచ్చిన బాలికలపై అత్యాచారం, భార్య కంటపడటంతో...

ఇంటికి సమీపంలో ఉన్న బాలికలపై కన్నేశాడు ఓ కామాంధుడు. ట్యూషన్ కోసం వచ్చిన వారిని శారీరకంగా వాడుకున్నాడు. అసలు ఆ కామాంధుడు ఏం చేస్తున్నాడో తెలియని వయస్సులో ఆ బాలికలు అతని చేతిలో బలైపోయారు.
 
ఒకరికి 15, మరో ఇద్దరికి 16, ఇంకొకరికి 17యేళ్ళు. ఈ వయస్సు వాళ్ళనే అనుభవించాడు ఆ టీచర్. గుజరాత్ అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన 40 యేళ్ళ మహిళ కరోనా సమయంలోను ఇంటి వద్దే ట్యూషన్ చెబుతోంది. మహిళ భర్త ఏ పనిచేయడు. ఇంటి పట్టునే ఖాళీగా ఉంటున్నాడు. 
 
అయితే ట్యూషన్‌కు వస్తున్న బాలికలపై ముందు నుంచి కన్నేశాడు. వారితో ఎంతో మంచిగా మాట్లాడుతూ మాయ మాటలతో ఒక్కొక్కరిని లొంగదీసుకున్నాడు. టీచర్ భర్త ఏం చేస్తున్నాడో తెలియని ఆ బాలికలు మౌనంగా భరిస్తూ వచ్చారు. ఇలా నలుగురిపై కొన్నిరోజులుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. భార్య స్వయంగా ఈ విషయాన్ని చూసి పోలీసులకు తెలిపింది. నిందితుడు ప్రస్తుతం కటాకటాల పాలయ్యాడు.