ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 మే 2021 (11:54 IST)

భాగ్యరాజ్ దంపతులకు కరోనా పాజిటివ్..

Bhagyaraj
తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే సోమవారం నుంచి కొత్త సర్కారు లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్‌ దంపతులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు శాంతను భాగ్యరాజ్‌ తెలియజేశారు. 
 
''నా తల్లితండ్రులు కె. భాగ్యరాజ్‌, పూర్ణిమా భాగ్యరాజ్‌కు ఈ రోజు కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు... మా కుటుంబంతో సహా వ్యక్తిగత సిబ్బంది సైతం క్వారంటైన్‌లోకి వెళ్లాం. గత పది రోజుల్లో మమ్మల్ని కలిసిన వారందరూ కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకోండి'' అని శాంతను ట్వీట్‌ చేశారు.