కరోనా బాధితులకు రూ.2కోట్ల విరాళమిచ్చిన కోహ్లీ దంపతులు

virat kohli couple
virat kohli couple
సెల్వి| Last Updated: శనివారం, 8 మే 2021 (11:56 IST)
కాసుల వర్షం కురిపించే (ఐపీఎల్) అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇంటికి చేరిన భారత సారథి విరాట్ కోహ్లీ వెంటనే కరోనా బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కరోనా బాధితుల సహాయార్థం 2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు విరాట్ కోహ్లీ.

ఫండ్ రైజింగ్ కోసం స్పెషల్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్‌ చేశారు. కరోనా నుంచి కోలుకోవడానికి దేశం పోరాడుతోందని...ప్రజలు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అనుష్క, తాను కెట్టోతో కలిసి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ మొదలెడుతున్నామని వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :