ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 28 మే 2021 (22:37 IST)

బాదం పాలు, బాదం నూనె ప్రయోజనాలు ఏమిటి?

మనం తీసుకునే పాలతో పోలిస్తే బాదం పాలు ఎంతో ఉత్తమమైనవి అని ఆరోగ్య నిపుణులు చెపుతారు. బాదం పప్పులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ ఉంటాయి. రక్తకణాలు, హీమోగ్లోబిన్‌ సృష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి బాదం పప్పులు ఎంతగానో తోడ్పడుతాయి.
 
బాదం నూనెను రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. చుండ్రు, వెంట్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం చూపుతుంది. బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్‌తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.
 
రాత్రి నానపెట్టిన బాదం గింజలను రోజూ ఉదయాన్నే తింటే యాంటీఆక్సిడెంట్స్, ప్రొటీన్స్, ఆవశ్యక కొవ్వులు లభిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని సమంగా ఉంచుతాయి. బాదంపప్పుల్ని ఉదయాన్నే తింటే రోజంతా చురుకుగా ఉండొచ్చు.
 
విటమిన్-ఇ తక్కువైతే ఇన్ఫెక్షన్లతో పోరాడే వ్యాధినిరోధక శక్తి సామర్ధ్యం తగ్గిపోతుంది. అందుకని విటమిన్- ఇ అధికంగా ఉన్న బాదం పప్పులు గుప్పెడు తింటే వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.